రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ఫలితాలలో పోరుమామిళ్ల లోని బెస్తవీధి చెందిన షేక్ వలి (స్టీల్) కుమార్తె షేక్ బిబి ఫాతిమా డీఎస్సీ డీజీటీ ఉర్దూ ఉర్దూ మీడియం ఫలితాలలో జిల్లాలో ఐదో ర్యాంకుతో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. సెప్టెంబర్ 25 న అమరావతిలో జరిగిన అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నందుకు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విజన్ కోచింగ్ సెంటర్ పాపయ్య సారుకి ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సభ్యులు తెలిపారు. అతి చిన్న వయసులో ఉద్యోగం సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంతో భావోద్వానికి లోనయ్యారు.
0 Comments