*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ –*
"*ప్రస్తుత సమాజంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కలగడం అత్యంత అవసరం. మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 1 రూపాయి హాస్పిటల్, అన్నదానం వంటి సంక్షేమ పథకాలతో పాటు, గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం సంతోషకరం. మహిళలకు ఉచితంగా టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, కుట్టు విద్య నేర్పించి, ఆ తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించడం ఒక గొప్ప సేవ. ఇది కేవలం ఒక చిన్న సహాయం కాదు, భవిష్యత్తులో ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి బాటలు వేసే ప్రణాళిక" అన్నారు.ఈ తరహా కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. చదువుతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారానే గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగగలరు. ఇటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్న సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి కృషి, నిబద్ధత వల్ల గ్రామంలోని అనేక మంది మహిళలు ఆర్థిక పరంగా బలపడతారు" అన్నారు.*
*కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, వైస్ ఎంపీపీ రాజశేఖర్, జిల్లా అనుబంధం విభాగాల నాయకులు రాళ్లపల్లి నరసింహులు, చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, రాజీవ్ భాష, సిద్ధమూర్తి రాజారెడ్డి,రంగసముద్రం ఉప సర్పంచ్ రుద్రవరం ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, టేకురుపేట సర్పంచ్ కల్లూరి రమణారెడ్డి, ఎంపీటీసీ జల్లి చండ్రాయుడు, యువ నాయకులు చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి, డాక్టర్ అమిత రెడ్డి,జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు సాయి నారాయణరెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు*
0 Comments