పోరుమామిళ్ల మండలం కృపా నగర్ కు చెందిన రాయపాటి బాలయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అత్యంత ప్రతిభను కనపరిచి ఎస్సే ఇంగ్లీష్ మరియు టీజీటీ ఇంగ్లీష్ రెండు ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఎస్సే జిల్లా 74 ర్యాంకు, క్యాటగిరి ర్యాంకు 4సాధించారు. సామాజికంగా వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, చదువు పట్ల ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో అంచలంచలుగా ఎదిగి, ఎంఏ ఇంగ్లిష్ సింహపురి యూనివర్సిటీ నెల్లూరులో గోల్డ్ మెడల్ సాధించారు.యోగి వేమన విశ్వవిద్యాలయం కడప నందు 2022 డిసెంబర్ లో ఇంగ్లీష్ లిటరేచర్ లో పీహెచ్డీ పట్టా పొందారు.పోరుమామిళ్ల పరిసరాలలో వివిధ డిగ్రీ మరియు జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ బోధకుడిగా పని చేస్తూ ఒక ఆదర్శవంతమైన అధ్యాపకుడిగా పేరుపొందారు. ఉన్నత విద్యావంతుడైన రాయపాటి బాలయ్య రెండు పోస్టులకి ఎంపికవడంతో తల్లిదండ్రులు రాయపాటి బయన్న, హృదయమేరి, సహోదరులు, కుటుంబ సభ్యులు, హర్షం వ్యక్తం చేశారు. తన భార్య సౌజన్య తను ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు చుదువుకు ఎంతో ప్రోత్సాహం అందించిదని అన్నారు. ఈ సందర్బంగా అధ్యాపకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
0 Comments