విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ



కడప జిల్లా పోరుమామిళ్లలోని చిత్తా శౌరి రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు కాశినాయ న మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్డి కొట్టాల, ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 90 మంది విద్యార్థులకు ఉచితంగా 360 నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళవారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి పి కృష్ణారెడ్డి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కొంత చేయూతనివ్వాలనే సదుద్దేశంతో ఈ నోటు పుస్తకాల పంపిణీ చేపట్టామన్నారు. కావున విద్యార్థిని, విద్యార్థులు వాటిని సద్వినియోగపరుచుకోవాలన్నా రు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, ఖదీర్ బాష, రాధిక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువు కోసం ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమంటూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై సంస్థ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments