సెంట్రల్ కిచెన్ పేరుతో 85వేల మంది కార్మికులను రోడ్డుపాలు చేయడం సిగ్గుచేటు --ఏఐటీయూసీ

 ఈనెల 8న భోజన కార్మికులు కడప కలెక్టరేట్ ధర్నాకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ పిలుపు 

 మధ్యాహ్న భోజన కార్మికులకు చట్టబద్ధత, వేతనాలు పెంచాలని ఏఐటియుసి మాజీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏరియా అధ్యక్షులు సఫా లు వారి బృందం పాలక ప్రభుత్వంపై ఆగ్రహం చెందారు

 ఈ సందర్భంగా పోరుమామిళ్ల ఏఐటియుసి మండల సమితి విలేకరుల సమావేశంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ వితంతువులకు, మహిళలకు అండగా ఆసరాగా   మధ్యాహ్న భోజన కార్మికులను  చంద్రబాబు గారు నియమించి, 30 సంవత్సరాలు గడిచిన తర్వాత, మెనూ చార్జీలు, పిల్లలకు రేట్లు, భోజనం కార్మికులకు వేతనం పెరగడముతో, నెలసరి మామూళ్ల కోసం కాంట్రాక్టర్లు, నెలనెల కమిషన్ల కోసం సెంట్రల్ కిచెన్ తీసుకురావడం చాలా దుర్మార్గం నీతిమాలిన చర్య అన్నారు

 మూడు సంవత్సరాలు ఉచితంగా మహిళలు పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం, పిల్లవాడికి పావలా నుండి పది రూపాయలు పైబడి డబ్బులు ఇచ్చే విధంగా ఎన్నో పోరాటాలు, కేసులు, జైల్లోకి వెళ్లి 500 వేతనము నుండి 3000 ఇచ్చే వరకు పోరాటం ద్వారా సాధించుకుని కాంట్రాక్టర్ల కోసం భోజన కార్మికులను తీసివేయడం అంటే మీ చేత్తో మీ కన్ను పొడుచుకునే విధంగా రేపు జరిగే స్థానిక సంస్థల్లో భోజన కార్మికులు పనిచేస్తారని, కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు.

 బాబు గారు మహిళలకు అన్నవలె, ఇంటి పెద్ద కొడుకు లాగా ఉంటానని, ఊరు వాడ అన్ని పట్టణాలు గ్రామాల్లో మీ కుమారుడు లోకేష్ బాబు పాదయాత్రలో, అసంఘటిత రంగ కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యన భోజన కార్మికులు చేసిన కృషి మరవడం చాలా బాధాకరం, సెంట్రల్ కిచెన్ వేరుతో కార్మికులను తొలగించే, వారికి చట్టబద్ధత కల్పించకపోతే, రిటైర్డ్ బెనిఫిట్స్ క్రింద 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, పి యఫ్, ఈ యస్ ఐ కల్పించాలని, నెలకు 10 వేలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అడుగుతుంటే కార్మిక కుటుంబ జీవితాలపై కడుపు కొట్టాలనుకునే ఆలోచన విరమించుకోవాలని వారన్నారు. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని వారు పాలక ప్రభుత్వాలను హెచ్చరించారు

Post a Comment

0 Comments