భారత రాజ్యాంగ, భారతరత్న, సామాజిక ఆర్థిక కార్మిక నిర్మాత, అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు సిపిఐ



 అణగారిన వర్గాల ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిపిఐ 

ఘనంగా బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు సిపిఐ 

 భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి,అని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, వారి బృందంతో అంబేద్కర్ కు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, పోరుమామిళ్ల మండల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా,స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు 1990లో భారతరత్న లభించింది. 

అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించి, ' రాంజీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ దంపతులకు జన్మించారు.
బాల్యం & విద్య: మహార్ కులానికి చెందిన ఆయన బాల్యంలో కుల వివక్షను ఎదుర్కొన్నారు. 

కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థికశాస్త్రంలో ఉన్నత విద్యను, డాక్టరేట్లను, పి.హెచ్.డి, డీఎస్సీ ని అభ్యసించారు.
సామాజిక పోరాటం: దళితుల కోసం 'బహిష్కృత భారత్' వంటి పత్రికలను నడిపారు. మహద్ సత్యాగ్రహం ద్వారా దళితులకు నీటి హక్కు కోసం పోరాడారు.
రాజ్యాంగ రూపశిల్పి: భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా, రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు.
మత మార్పిడి,మహాపరినిర్వాణం: హిందూమతంలోని కుల వ్యవస్థను నిరసిస్తూ ఎన్నో డిగ్రీలు చదివి భారత రాజ్యాంగాన్ని రూపొ ందించి దేశ ప్రజలకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కేశవ, సఫా, పిరయ్య
 బి కోడర్ మండల కార్యదర్శి ప్రసాద్, డి హెచ్ పి ఎస్ ప్రసాద్, షాహిదా, అధిక సంఖ్యలో మండల నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments