పోరుమామిళ్ల పట్టణంలోని వివేకానంద చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ దుబ్బాక కిషోర్ శర్మ స్వామి జి గారు పంచాంగ శ్రవణం వినిపించారు.
ప్రవచనకర్తగా విచ్చేసిన గీతా ప్రచారక్ శ్రీమతి పెళ్ళురు సుష్మ శ్రీ గారు మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన గీతను నేర్చుకోవడం వల్ల జీవితం ప్రగతి వైపు పయనిస్తుందని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతను నిత్య జీవితంలో నేర్చుకొని ఆచరించాలని కోరారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన యనమల సుధాకర్ గారు మాట్లాడుతూ ఉగాది ప్రకృతి సిద్ధంగా వచ్చిందని కాబట్టి అందరూ మంచి సంకల్పంతో ముందుకు వెళ్లి ఈ సంవత్సరం విజయం సాధించాలన్నారు.వివేకానంద చైతన్య సమితి అధ్యక్షులు బీరం రామకృష్ణారెడ్డి, కార్యదర్శి గుండెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానందుని స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలను సంక్రాంతి సంబరాలను స్వామి వివేకానంద జయంతిని సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు.
సమితి వారి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా భగవద్గీత పోటీలను నీతి పద్యాల పోటీలను దేశభక్తి దైవభక్తి పాటలను ఉగాది కవితల పోటీలను పాఠశాలలవిద్యార్థులకు సమితి వారు నిర్వహించి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను బహుమతులను అందజేయడం జరిగింది. మరియు పోరుమామిళ్ల పరిసర ప్రాంతాలలోని సాహితీవేత్తలను కవులను ప్రోత్సహిస్తూ బహుమతులను ఇచ్చి సన్మానించడం జరిగింది మరియు పోరుమామిళ్ల పరిసర ప్రాంతాలలో వివిధ సేవా రంగాలలో కేవలందించే వారికి ప్రోత్సాహక బహుమతులను అందించి గౌరవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి బెల్లంకొండ ఫణీరావు స్వామి వెంకటరామిరెడ్డి రవి కేశవరావు పోకల సుబ్బారెడ్డి నూనె శ్రీనివాసులు సుమంత్ గురుమూర్తి కుర్ర చెన్న కృష్ణయ్య అచ్యుత రామారావు రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున పోరుమామిళ్ల పట్టణ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
0 Comments