నా భూమిని లాక్కునేందుకు దౌర్జన్యం చేస్తున్నారు: సుబ్బరాజేశ్వరరావు


 కాశి నాయన మండలం ఇటుకుల పాడు గ్రామ పొలం సర్వేనెంబర్ 458 లో 18.40 సెంట్ల రిజిస్టర్ భూమిని యనమల రాములు అనే ఆమె వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేపించుకున్న భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని గ్రామానికి చెందిన గంజికుంట సుబ్బరాజేశ్వరరావు ఆరోపించారు.
 ఈ సర్వే నెంబర్ ఆర్ ఎస్ ఆర్ ప్రకారం ఆకుల రోసిగాడు, ఓబిగాడు అనే వారి పేర్ల మీద ఉంది. అయితే 1966లో విక్రయ అగ్రిమెంట్ కింద తమ అబ్బ గారు అయినా గంజికుంట చెన్నకేశవులు కి అమ్మినారు. తదనంతరం ఆ భూమిని అదే గ్రామానికి చెందిన యనమల రాములు అనే ఆమెకు విక్రయ అగ్రిమెంట్ ద్వారా 1989లో అమ్మడం జరిగిందన్నారు. అప్పటినుంచి ఆమె గవర్నమెంట్ కు శిస్తు కట్టుకుంటూ భూమిలో సాగు చేస్తూ ఉండేది. ఆమె పేరున అన్ని రికార్డులు ఉన్నాయి. అయితే 2018లో నరసాపురం సొసైటీ బ్యాంకులో మార్టికేజ్ లోను కూడా తెచ్చుకుంది. తాను ఆర్మీ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన తర్వాత తమకు వచ్చిన డబ్బుతో తమ అబ్బ గారు అమ్మిన ఈ భూమిని మళ్లీ మేము కొనాలని కోరగా ఆమె సొసైటీ బ్యాంకులో ఉన్న రుణాన్ని క్లియర్ చేసి తమకు 2019లో రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు తమ ఆధీనంలో ఉంది. కొన్ని రోజులకు మైదుకూరు కు చెందిన ఆకుల ఓబులేసు అనే వ్యక్తి పేరున దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి సావిశెట్టిపల్లి గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు పోలయ్య, ఇటుకులపాడు గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి,రమణారెడ్డి,బాలయ్య, చిన్న కొండయ్య, పిచ్చయ్య, మల్లయ్య,పీరయ్య తదితర వ్యక్తులు తమ భూమిని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తూ తమను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లోనే పోలీస్ స్టేషన్లో మరియు రెవెన్యూ కార్యాలయాలు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. అనంతరం గౌరవ న్యాయస్థాయానాన్ని ఆశ్రయించగా తమకు ఉన్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి *ఇన్ట్రీమ్ ఇంజక్షన్ ఆర్డర్* ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా పూర్తి ఆర్డర్ వచ్చేంతవరకు ఈ ఆర్డర్ మాకు ఉందన్నారు. ఈనెల 8వ తేదీ సేద్యం చేస్తుండగా తనను చంపుతామని బెదిరించగా భయపడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేయడం కూడా జరిగిందన్నారు.మేము సాగులో లేమని ఈ భూమి మాకు చెందినది కాదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు చూసే తమకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. తమ భూమిని ఆక్రమించేందుకు వీరంతా కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. వీరందరూ కలిసి మా మీద ప్రభుత్వ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. ఈ భూమి ఎవరికి చెందినది అనే అంశం అధికారులకు అందరికీ తెలుసు అన్నారు. వారి దగ్గర ఉన్న పాస్ బుక్కులను పరిశీలిస్తే వారు నకిలీ పత్రాలు ఏ విధంగా సృష్టించారో అర్థమవుతుందని వారు గుర్తు చేశారు. తమకు న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. కావున జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments