78 ఏళ్ల స్వాతంత్రం, దాదాపు 146 కోట్ల జనాభా గల దేశం..ప్రపంచాన్ని మార్చగలిగే మేధావులు,శాస్త్రవేత్తలు, రాజకీయ దురంధరులు,విద్యావేత్తలు, వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు, సర్వమత సౌలభ్యం సాధించే సేవకులు మరో కొత్త లోకాన్ని సృష్టించగలిగే సామర్థ్యం గల సంపన్న దేశం. అయినా అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇంకా అభివృద్ధి జరుగుతున్న దేశం. విలయ తాండవం చేస్తున్న దారిద్యం, నిరుద్యోగం, ఆకలి చావులు,ఆత్మహత్యలు, హత్యలు,కులాల మతాల మధ్య వైసమ్యాలు ఇవన్నీ ఇంకా 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పట్టి పీడిస్తున్నాయంటే...
లోపం ఎక్కడ?
పరిపాలన లోపమా?
బాధ్యత లేని ప్రజల వైఖరా?
నైతిక విలువలు లేని విద్యా వ్యవస్థయా?
ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నాను.కొన్ని శతాబ్దాల నుండి మన దేశ కుటుంబ వ్యవస్థను పరిశీలిస్తే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలను ఎన్నో నైతిక విలువలతో సంప్రదాయ పద్ధతులతో కుల మతపరమైన విధానాలను ప్రత్యేకించి మనుగడ సాగించింది.ఏ మతమైనా మానవుని జీవన విధానాన్ని సన్మార్గంలో పయనించడానికి తప్ప స్వార్థపూరిత ఉద్దేశం కాదు. కులాలు మతాలు మనదేశంలో మనుషుల మధ్య అనేక వర్గాలుగా విభజించి రాజ్యాధికారం కోసం, ధనాపేక్ష కోసం స్వార్థపూరిత రాజకీయాలతో మనిషి మనిషికి ఏదో ఒక రూపంలో చిచ్చుపెట్టి లౌకిక తత్వాన్ని మట్టి కరిపించే విధంగా రాజకీయాలు తయారు కావడం ఎంతో దౌర్భాగ్యం.మేధావుల మౌనం వహించే పరిస్థితి ఎదురవుతుంది.యువత తన బాధ్యతను మరిచి వ్యసనాలకు లోనై భావిభారత నిర్మాతలైన తన జీవితాలను అనధి కాలంలోనే కాలగర్భంలో కలిపి వేసుకుంటున్నారు.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇక్కడ మన దేశంలో 85% ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. మిగతా కులాలలో పేదవారు కూడా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు పాఠశాల స్థాయి నుండి తమ పూర్వకాలంలో నుండి గ్రామాలలో అంటరానితనాన్ని, పేదరికాలనీ ఎలాగోలాగా పాఠశాల విద్యను ఎన్నో సమస్యలను దాటుకుని కళాశాల, ఆపై యూనివర్సిటీ స్థాయికి వస్తారు. అక్కడ రకరకాల రాజకీయ పార్టీలు వీరిని "శాస్త్రీయ పద్ధతిలో లేని విద్య మనకు వద్దు "అనే నినాదంతో ఎరవేసి దేశాన్ని ఉద్ధరించడానికి అవినీతిని తుది ముట్టించాలని చిన్నగా విద్యార్థి సంఘాలలో చేర్పించి చివరకు విద్యా వ్యవస్థను దూరం చేసి చిలికి చిలికి గాలి వానగా మారి నిరుద్యోగం, అవినీతిని పారుద్రోలి దేశాన్ని ఉద్ధరించడానికి నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా మారే వాతావరణాన్ని సృష్టించి ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ ఇంకా ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడిన కొంతమంది తక్కువ శాతం ఇతర కులాలు నక్సలైట్లు తీవ్రవాదులుగా మారుతున్నారు. రాజకీయ నాయకుల పిల్లలు అమెరికాలో లండన్ లోను చదువుతూ ఉంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు నక్సలైట్లు,తీవ్రవాదులుగా మారిన ఎస్సీ ఎస్టీ బీసీ లను ఎన్కౌంటర్ల పేర్లతో ఉరిశిక్షల పేర్లతో తుద ముట్టిస్తున్నారు.
కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం
ఏమిటంటే
••••••••••••••••••••••••••••••••••••••••••••••
ప్రభుత్వ ఉద్యోగాలలో అనగా పోలీసు, సైనికులు, నక్సలైట్లు తీవ్రవాదుల కోసం ప్రత్యేకంగా నియమించిన పోలీసు వ్యవస్థ వీరంతా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ.. తన ఉద్యోగ ధర్మం అన్నట్లు నక్సలైట్లను తీవ్రవాదులను తుది ముట్టడించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు... తమకు తెలియకుండానే ఎస్సీ ఎస్టీ బీసీలను తను వేలుతో తాను పొడుచుకున్నట్లు చంపుకుంటూ పోతున్నారు. ఇక్కడ తమ బహుజనలను తామే చంపుకుంటున్నామని వారు గమనించడం లేని పరిస్థితి.
కాబట్టి మూలం ఎక్కడ ఉంది? దేశాన్ని పరిపాలించే అగ్ర కులాల నాయకులు సీరియల్ చూస్తున్నట్లు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన దేశాన్ని మనకు అర్థం కాకుండానే రాజరికని నడిపిస్తున్నారు. వీటన్నిటికీ అధికమించాలంటే
*యువతలో, ప్రజల్లో మార్పు రావాలి...
బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో అప్పుడే అవమానాలతో, ఆర్థిక అసమానాలతో సతమతమైన బహుజనులు స్వతంత్ర దేశంగా మార్చే ఆయుధాన్ని పొందగలరు. ఇవన్నీ జరగాలంటే
ఒకటే ఆయుధం అదే ఓటు
•••••••••••••••••••••••••••••
ఓట్లు మనవి సీట్లు వాళ్లవి
మందు,మాంసాలకు చిల్లర కరెన్సీకి ప్రలోభాలకు గురికాక మనలో ఎప్పుడు మార్పు వస్తుందో అప్పుడే రాజ్యాధికారం దేశం సుభిక్షంగా ఉంటుంది.
వీటన్నింటికీ దిశా, నిర్దేశాలను చూపే అజెండా నుండి పురుడు పోసుకున్న రాజకీయ పార్టీయే బహుజన సమాజ్ పార్టీ ( మన కలలను నిజం చేసే ఒక వేదిక) •••••••••••••••••••••
అని నా ఉద్దేశం. మానవుని మానసిక స్థితిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు సమైక్య దేశాన్ని సృష్టించగలం. దీనికి ఒక్కటే మార్గం ధ్యానం. ••••••••••••••••••••••••••••••••••••••••••••••
చివరిగా ఒక్క మాట
" ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో••
ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకుని తిరుగగలడో•••
ఎక్కడ ప్రపంచం ముక్కలు,ముక్కలైపోయి మగ్గిపోకుండా ఉంటుందో•••
ఎక్కడ చదువు,విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోకుండా ఉంటుందో ••••
ఎక్కడ ఒక మనిషి మనిషిని దోచుకోకుండా ఉంటాడో ••••
అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు "
అన్న
విశ్వకవి రవీంద్ర ఠాగూర్.....
"నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు..
జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు..
అన్న
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం ఉన్నవాడికి బానిసలవడం....
ప్రభువెక్కిన పల్లకి కాదు దాన్ని మోసిన బోయిలెవ్వరు?"
అన్న
మహాకవి శ్రీశ్రీ
మహానుభావులు ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని నవయుగ దేశాన్ని నిర్మిద్దామని కోరుతూ......
••••
••పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప•••
**సర్వేజనా సుఖినోభవంతు**
0 Comments