2025 నవంబరు 26వ తేది బుధవారంనాడు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూబ పోరుమామిళ్లలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ ఆందోళన చేయడం జరిగిది .
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు. కార్మికులు సంఘం పెట్టుకొని తమ సమస్యలు పరిష్కారం కొరకు సమ్మెలు చేసే దానికి కూడా ఈ నాలుగు కోళ్లు ద్వారా కార్మికులను ఉక్కు పాదం మోపడం అనేది ఈ నల్ల నాలుగు చట్టాలని వారు అన్నారు కార్మిక హక్కులు కాలరాయడమే బిజెపి దుర్మార్గమైన ప్రభుత్వం అని కార్మికుల పైన కపట ప్రేమ చూపిస్తూ కార్మికులను మభ్యపెడుతూ ఈ దేశంలోని బిజెపి మోడీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మతోన్మాదమైనటువంటి రూపంతో ప్రజలపై అధిక భారాలు ఏస్తున్నటువంటి మోడీ సర్కార్ అని వారన్నారు గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండే చట్టం స్థానంలో నూతన లేబర్ కోడ్ లలో 300 మంది లోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్, లాక్ ఔట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్బంగా పరిశ్రమ మూసివేసి కార్మికుల పోరాటాలను నిరుగార్చేందుకు సహకరిస్తాయని విమర్శించారు. ప్రమాదాల సందర్భంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన యజమానికి పరిహారం చెల్లించే భాద్యత నుండి తీసివేసిందని, ఆన్ లైన్ యాప్స్ లో పనిచేసే గిగ్ వర్కర్స్, కోటి మంది పనిచేసే ప్రభుత్వ స్కీం వర్కర్లను కార్మికుల నిర్వచనం నుండి లేబర్ కోడ్లు తొలగించాయని, అన్ని చట్టాలు అమలుచేస్తున్నట్లు యజమాని సొంత పూచీకత్తు ఇస్తే ఎటువంటి చెకింగ్ చేయకుండా చట్టం చేసారని, ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మరతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ ల అమలుకై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో కార్మిక వర్గం ఏకమై ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్ అధ్యక్ష కార్యదర్శులు చిన్నయ్య గురయ్యా సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌస్యాబేగం బీబి,మేరీ మేకల బాలయ్య దుర్గయ్య సునీల్ ఓబులమ్మ రాజు రమణయ్య హంద్రయ్యతదితరులు పాల్గొన్నారు.
0 Comments