నాలుగు నల్ల లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఎత్తేయ్యాలి: సిపిఎం



స్థానిక పోరుమామిళ్ల అంబేద్కర్ విగ్రహము వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు నల్ల లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమము చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్.భైరవప్రసాద్ మాట్లాడుతూ....
 *కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చాలా దుర్మార్గమని వారన్నారు  
  కార్మిక చట్టాలకు వలస పాలనగా ఉన్నాయని వాటిని ఆధునికరించి అమలు చేసేందుకే నాలుగు లేబర్ కోడ్లు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధంఅనీ వారు అన్నారు వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లలో అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను చొప్పించారుఅనివారు అన్నారు అందులో మచ్చుకు ఒక ఉదాహరణగా అందరి దృష్టికి తెస్తున్నామన్నారు ఇప్పటివరకు ఏదైనా కర్మాగారం లేదా కంపెనీ లే-ఆఫ్ చేయాలన్నా, లేదా లాకౌట్ చేయాలన్న 100 మంది అంతకుమించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ షరతు 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారుఅన్నారు అంటే 300 లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లే-ఆఫ్ లేదా లాకౌట్లు చేసుకోవచ్చుఅనీ ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద ఉద్యోగ భద్రత మీద జీతభత్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇస్తున్నారఅనీ,ఇలాంటి ఆయుధాలు ఈ లేబర్ కోడ్ల ద్వారా కార్పొరేట్లకు చాలానే అందిస్తున్నారుఅనీ అందుకే ఈ లేబర్ కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లేబర్ కోర్టులో అమలు చేయాలని ఉద్యమాలు పోరాటాలు సిద్ధం అవుతావని వారు హెచ్చరించారు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు 
ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు గౌసియాబేగం ,కార్మిక నాయకులు రవి, జమాల్,హంద్రీయ, బీబీ,మేరీ, ఓబులమ్మ హుస్సేన్ ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments