*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ —*
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు మరియు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి రూ.8 వేల కోట్ల వ్యయంతో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.*
*2019 వరకు రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ పాలనలో 2023–24 నాటికే ఐదు కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమైనట్లు చెప్పారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోందని తీవ్రంగా విమర్శించారు.*
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ‘కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం’ ప్రారంభించామని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.*
*పంచాయతీ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణతో పాటు ‘ప్రజా వైద్యం... ప్రజల హక్కు’ పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ ఉద్యమం కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటమని ఎమ్మెల్సీ గారు అన్నారు.*
*“గతంలో వైఎస్ జగన్ గారి పాలనలో ఈ ఉద్దికట్ట వీధిలో అండర్ డ్రైనేజ్ మరియు సిసి రోడ్ల వంటి అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పుడు స్థానిక ముస్లిం మైనారిటీ మహిళల అభ్యర్థన మేరకు రూ.10 లక్షల వ్యయంతో మిగతా సిసి రోడ్డు పనులను పూర్తి చేస్తాం. అలాగే వారి కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేపడతాం” అని హామీ ఇచ్చారు.*
*ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, వైస్ ఎంపీపీ రాజశేఖర్, మాజీ సింగల్ విండో చైర్మన్ పోరుమామిళ్ల మండల అబ్జర్వర్ ఓబుల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ భాష, ఎంపీటీసీలు ఇషాక్, గురప్ప, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పొదిలి మస్తాన్ మనీ,వార్డు మెంబర్లు మహబున్నిసా(బడిబచ్చి) సుబ్బారావు, , సచివాలయం అబ్జర్వర్ డాక్టర్ బాబు, పార్టీ నాయకులు బాలుడు, దాదాభాష, జిందాబాద్, బూత్ కన్వీనర్ షరీఫ్, హుస్సేన్ పీరా, పలుకూరి రాముడు, సుబ్బరాజా, అబ్దుల్, గౌస్ జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు సాయి నారాయణరెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు*
0 Comments