భూత,భవిష్యత్,వర్తమాన కాలజ్ఞాని అయినటువంటి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి స్వగృహం ఈ వర్షాలకు కూలబడింది.ఈ స్వగృహం ఆనాడు స్వామి వారు నిర్మించుకున్నట్లు పెద్దలు చెప్పేవారు.ఈ గృహం నిర్మించి ఇప్పటికీ ఎన్నో ఏండ్లు అయినప్పటికీ అది క్రమేనా పాతబడిపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కూలింది. స్వామి స్వగృహం పాత బడి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అధికారులకు,రాజకీయ నాయకులకు ఎన్నోసార్లు వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది.అయితే దీన్ని ఏమి చేయలేక,ఏమి చేసినా న్యాచురాలిటీ దెబ్బతింటుందనే కారణంతో ఆ గృహాన్ని అలాగే ఉంచడం జరిగింది. ఇప్పటికైనా ఈ గృహం విషయంలో స్థానిక నాయకులు,సంబంధిత అధికారులు కల్పించుకొని ఏదో ఒక మార్గం చూడాలని కందిమల్లాయపల్లె పుర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.*
0 Comments