ప్రమాద అంచుల్లో విద్యుత్ స్తంభం,తీగలు పట్టించుకోని అధికారులు.



కాసినయన మండలం కొట్టాల పల్లె గ్రామానికి చెందిన రైతు రమేష్ రెడ్డి పొలం లో గత 2ఏళ్లుగా విద్యుత్ స్తంభం,తీగలు ప్రమాద అంచుల్లో ఉన్న విద్యుత్ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతు ఆరోపించారు.పలుమార్లు విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసిన నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన వాపోయారు.ప్రాణాలు పోయాక సమస్య పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. లైన్ మ్యాన్ కు పలుమార్లు ఫోన్ చేసిన నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడని వారన్నారు.. ఏఈ కి పిర్యాదు చేసిన పరిష్కారం శూన్యమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Post a Comment

0 Comments