కాశి నాయన మండలం కత్తెర గండ్ల పంచాయతీ చెన్నవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కాశినాయన మండలం తాసిల్దార్ వెంకటసుబ్బయ్య ఆదేశానుసారం వీఆర్వో నాయక్ ఆధ్వర్యంలో వీఆర్ఏలు చెన్నయ్య ,చిన్న చెన్నయ్య లు కలిసి కత్తెర గండ్ల రెవిన్యూ పొలంలో సర్వేనెంబర్ 1601 , 1617 సర్వే నెంబర్ల పైకి నాలుగు ఎకరాల 19 సెంట్లు విస్తీర్ణం కలదు ఆ విస్తీర్ణంలో ఈరోజు అనగా 28-09-2025 తేదీన ఆ స్థలంలో తాసిల్దార్ గారి సూచకతో బోర్డు ఏర్పాటు చేస్తుంటే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మాబు, చెన్నవరం స్కూల్ వంట ఏజెన్సీ భర్త పోతగంటి ఖాజావలి , మునిరెడ్డి, దశరథరామి రెడ్డి లు సూచిక బోర్డు నాటకుండా రెవిన్యూ అధికారులకు అడ్డు తగులుతున్నారని విఆర్ఓ నాయక్ తెలిపారు అంతేకాకుండా ఇంతకుముందు కత్తెర గండ్ల శివాలయం టు చెన్నవరం చెన్నకేశవ స్వామి గుడి వరకు రోడ్డు సర్వే చేస్తుండగా రెవెన్యూ అధికారులకు అప్పుడు కూడా ఉగాది ఫీల్డ్ అసిస్టెంట్ మాబు అడ్డు తగలరని ఈయన ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడా లేక కార్యకర్తగా పనిచేస్తున్నాడా అనే సందేహం ప్రజల్లో ఏర్పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయం తాసిల్దార్ కు తెలియపరుస్తానని ఆయన తెలిపారు అయితే ఇప్పటికైనా చెన్నవరం గ్రామంలో *దూదేకుల కులస్తులు 75 కుటుంబాలు* ఉన్న స్మశానానికి ఎకరం స్థలం అడగడం తప్ప ! అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరి వ్యక్తులకు భజన చేస్తున్నారని అధికారులు జీతాలు తీసుకునేది ప్రభుత్వం దగ్గర నుంచి నా లేక వ్యక్తుల దగ్గర నుంచి నా అనే అనుమానం ప్రజల్లో ఏర్పడుతుందని దీనిపై ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి దూదేకుల స్మశాన వాటిక సమస్య తీర్చగలరా లేదా అని చెన్నవరం దూదేకుల కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూచిక బోర్డు విషయమై కాశి నాయన మండల తాసిల్దార్ ను వివరణ కోరడానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇందులో ఎమ్మార్వో గారి ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు
0 Comments