*మైదుకూరు పట్టణంలోని టి. వి. ఎస్. ఎం పాఠశాల గుర్తింపు రద్దు చేసి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.:ఎస్ఎఫ్ఐ

*మైదుకూరు పట్టణంలోని TVSM పాఠశాల గుర్తింపు రద్దు చేసి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

మైదుకూరు పట్టణంలో ఉన్న TVSM స్కూల్ కరస్పాండెంట్ పాఠశాల లో చదువుతున్న విద్యార్థినిలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది.కావున కరస్పాండెంట్ పై చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని , భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కడప DEO ఆఫీస్ నందు జిల్లా DEO షంశుద్దీన్ గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షు, కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..

మైదుకూరు పట్టణంలోని TVSM స్కూల్ కరస్పాండెంట్ వెంకేశ్వర్లు విద్యార్థిని పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది.స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించవలసింది పోయి స్కూల్ లో చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇలాంటి వారి వల్ల విద్యా వ్యవస్థకు నాశనం అవుతుంది, గతంలో కూడా కరస్పాండెంట్ ఇలాగే మహిళలు,విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లైంగికంగా వేధించడం వంటివి జరగాయి ఇంకా గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, కాబట్టి స్కూల్ కరస్పాండెంట్ ను కఠినంగా శిక్షించాలని,అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థినులకు కనీస భద్రత కూడా లేదు కావున అక్కడ చదువుతున్న విద్యార్థులకు కనీస భద్రత కల్పించాలని, అదేవిధంగా స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి కనపడుతుంది కావున మళ్లీ ఇలాంటి జరగకుండా స్కూల్ పై కట్టిన చర్యలు తీసుకొని, వెంటనే TVSM స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని, భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కోరుతున్నాం లేని పక్షంలో నియోజవర్గం అలాగే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న,ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజ శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments