కాశినాయన మండలం లోని రెడ్డి కొట్టాల జడ్పీ హైస్కూల్ లో పరిమళ జ్యోతి ని ఘనంగా సన్మానించారు.రాష్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరిమళ జ్యోతిని రెడ్డికొట్టాల గ్రామం లోని జెడ్పీ హైస్కూల్లో నాలుగు సంవత్సరాలు గా ఆమె పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆమె చేసిన వినూత్న కార్యక్రమాలను ప్రశంసించి రెడ్డి కొట్టాల పంచాయతీ సర్పంచ్ గుర్రమ్మ, సర్పంచి కుమారుడు తిరుపతి పాఠశాల ఉపాధ్యాయులందరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థులు మంచి మార్గంలో నడిచే విధంగా అంతేకాకుండా విద్యార్థులకు మంచి మధ్యాహ్నం భోజనం చేసే విధంగా ప్రతిరోజు పరిశీలించి వారిని దగ్గర ఉండి చూసుకుంటానని రెడ్డి కొట్టాల జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పథంలో నడిపే దానికి ముందు ఉంటానని ఇలాంటి అవార్డులు రావడం వల్ల నాకు మరింత బాధ్యత పెంచిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాకా చంద్రశేఖర్,ఖదీర్ బాష, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్,బాష,దేవరాజు, సురేష్, మహేష్, విద్యార్థుల తండ్రులు, సిద్దయ్య,కొండయ్య,శ్రీలత, సావిత్రి , టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments