భోజన కార్మికుల సమస్యలపై పాలక ప్రభుత్వాలకు పట్టవా ?? ఏఐటియుసి సూటి ప్రశ్న
స్మార్ట్ కిచెన్ ల పేరుతో భోజన కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేయడం తగదు ఏఐటియుసి
23సంవత్సరాల నుండి చాలీచాలని మెస్ చార్జీలతో పోరాటాల ద్వారా మిస్ రేట్లు పెంచుకుంటూ భోజన కార్మికుల కుటుంబాలు నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తాయన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లో పేరుతో భోజన కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని ఏఐటియుసి మధ్యాహ్న భోజనం జిల్లా గౌరవ అధ్యక్షుడు చాంద్ బాషా విలేకరుల సమావేశంలో పాలక ప్రభుత్వాలపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు చాంద్ భాషా, మోహన్, రేణుకమ్మ, రాజి, లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు గారు మహిళలకు మధ్యాహ్న భోజనం పిల్లలకు వండి పెట్టడం ఒక వరం లాంటిది అని స్వయం సహాయక సంఘాల ద్వారా మీరు. మహిళలను వంట ఏజెంట్లుగా నియమించి ఈరోజు సెంట్రల్ కిచెన్, స్మార్ట్ కిచెన్ ల పేరుతో కాంట్రాక్టర్లు స్వలాభం కోసం ఈ విధంగా 23 సంవత్సరాల నుండి పనిచేసిన కార్మికులకు కడుపు కొట్టి, కాంట్రాక్టర్ల స్వభావం కోసం మీరుఈ పని చేయడం తగదు అన్నారు
అలాగే కార్మికులకు కనీస వేతనం 18000 ఇవ్వాలని, పిఎఫ్ , ఈ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని, చట్ట భద్రత ఇవ్వాలని, ఒకపక్క అడుగుతూ ఉంటే మరొక పక్క సెంట్రల్ కిచెన్ పేరుతో కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసే విధంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు అన్నారు
భోజన కార్మికులు ఉచితంగా మూడు సంవత్సరాలు పని చేసి అనంతరం గౌరవ వేతనం 500 రూపాయలు నుండి 3000 రూపాయల వరకు పోరాటల ద్వారా సాధించుకుంటే, ఇప్పుడు కాంట్రాక్టర్లు కు భోజన కార్మికులపై కన్నుబడి అధిక సంఖ్యలో పేద విద్యార్థి పిల్లల కడుపు కొట్టి డబ్బులు సంపాదించుకోవాలన్నా దురాశతో సెంట్రల్ కిచెన్ పెడితే వాటికి మీరు వత్తాసు పలకడం సరైన పద్ధతి కాదని ఏఐటీయూసీగా తమరి విన్నవించుకోవడం జరుగుతుంది వెంటనే కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి స్మార్ట్ కిచెన్ ల ఆలోచనలు విరమించుకొని కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే సెంట్రల్ కిచెన్, స్మార్ట్ కిచెన్లో లలో, ప్రతి కార్మిl లను, ఆయాలుగా, చదువు ఆధారంగా వారిని, పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే 27 వ తేదీ శనివారం మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో కడపలో జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సమావేశం కి పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటియుసి మండల సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం
0 Comments