*బ్యాంకుకు చెల్లని చెక్కు ఇచ్చిన నిందితుడికి జైలు శిక్ష*


చెల్లని చెక్కు విషయంలో నిందితుడికి జరిమానా జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు మొబైల్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోటి రూపాయలు రుణం తీసుకున్నారు. బాకీ చెల్లింపు నిమిత్తం శ్రీనివాసరావు బ్యాంక్ అధికారులకు చెల్లని చెక్కు ఇచ్చారు. పలుమార్లు నోటీసులు పంపించిన శ్రీనివాసరావు స్పందించకపోవడంతో బ్యాంకు వారు మొబైల్ కోర్టులో ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్ శ్రీనివాసరావుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష రూ.1,90,86,922 నగదును జరిమానంగా విధించి ఆ నగదులో బ్యాంకుకు రూ. 1,90,76,922 చెల్లించాలని తీర్పించింది.

Post a Comment

0 Comments