ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం .

ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాన్నినిర్మిస్తున్నది. అందులో భాగముగా ఈనాడు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.డి విజయ జ్యోతి  జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతోనూ మరియు జిల్లా కార్యవర్గంతోనూ సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం అగుటకు తగు సూచనలు సలహాలు అందజేసినారు. అనంతరం కడప నగరంలో 27వ డివిజన్ ఇన్చార్జి షామీర్ హుస్సేన్  అభ్యర్థన మేరకు గౌస్ నగర్ లో ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమాన్ని లాంచనముగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్చార్జ్ లు మీగడ అశోక్ కుమార్ రెడ్డి  ధ్రువ కుమార్ రెడ్డి  ఇర్ఫాన్ భాషా  మరియు కడప నగర అధ్యక్షులు  గౌస్ పీరా  యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విజయ్  జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్  మరియు నగరంలోని ఇతర డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments