కడప జిల్లా . బద్వేల్ నియోజకవర్గం లోని, కలసపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హాస్పిటల్ కి వచ్చిన పేషంట్లైన మహిళలకు, మరియు వృద్ధులకు టాయిలెట్స్ పోయేందుకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు పేషెంట్లు గురవుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సగిలి గురయ్య ,కారు ఎజ్రా, మరియు కారు లాజరస్, అన్నారు. గురువారం వారు ప్రభుత్వ కార్యాలయాల వ్యవస్థ తీరుపై హాస్పిటల్ ను సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూడగా చుట్టూ ఎదిగిన పిచ్చి మొక్కలతో జుట్టు పరిసర ప్రాంతాలు ప్రజల అనారోగ్యానికి దారితీస్తుందని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను వెంటనే శుభ్రం చేయించాలని వారు తెలిపారు. తద్వారా వచ్చే పేషెంట్లకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉందని తెలిపారు . అలాగే గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు వృద్ధులు వచ్చినప్పుడు వారికి అర్జెంటుగా టాయిలెట్స్ అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్లాలని అర్థం కాక ఒకటి రెండు సార్లు అక్కడ ఉన్న నర్సులను మరియు అటెండర్ లను అడిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి మెయింటినెన్స్ కోసం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కలసపాడులో త్రాగే నీరు లేక కూర్చొని ఎందుకు పేషెంట్లకు బెంచీలు లేక, డాక్టర్లు ఒక చోట మందులు ఒకచోట గ్రామాల నుండి వచ్చే ప్రజలకు అర్థం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఇంతకుముందు హాస్పిటల్ ఓపి మరియు మందులు అన్ని ఒకే చోట ఇస్తున్నారు. నూతన భవనం ఏర్పడినప్పటి నుండి ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉందని డాక్టర్ ఎక్కడ ఉంటారో తెలియదని వారు అనుకుంటున్నారు.కనీసం త్రాగేందుకు మంచినీరు కూడా పెట్టలేని స్థితిలో డాక్టర్లు ఉన్నారంటే ఏమాత్రం ఆసుపత్రి మీద శ్రద్ధ ఉందో మనమే గమనించాలి. ఆసుపత్రికి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు. వ్యాక్సిన్సు మరియు మందులు కూడా అవసరమైన సమయంలో లేవంటున్నారని, ప్రజలు అనుకుంటున్నారు.ప్రజలు తాగేటందుకు మంచినీళ్లు కూడా లేని పరిస్థితి హాస్పిటల్లో ఉంది. దీనిపై వెంటనే డి ఎం అండ్ హెచ్ వో స్పందించి హాస్పిటల్లో సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలనీ, పగటిపూట హాస్పిటల్ క్లీన్ చేసేవారు మరియు రాత్రి పూట వాచ్మెన్ తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, కారు. లాజరస్ మండల అధ్యక్షులు, కారు ఎజ్రా, జిల్లా ఉపాధ్యక్షులు, సగిలి గురయ్యా మండల ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు హుస్సేన్ పీరా ,తదితరులు ప్రజలు పాల్గొన్నారు.
0 Comments