కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో దమ్మనపల్లి పంచాయతీ కటికింద పల్లె హరిజనవాడలో ఈదురుగాలికి విద్యుత్ స్తంభం నేలకొరిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కాలనీ లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా వారు కోరారు. కాలనీలోని ప్రజలు అధికారులకు ఎంత విన్నవించుకున్నానో పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments