యంబడి ఈశ్వర్ కు మథర్ తెరెస్సా సేవా రత్న అవార్డు -2026 .





 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలోని మథర్ తెరెస్సా ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి , 
కో డైరెక్టర్ గిరి ప్రణీత్ రెడ్డి  పోరుమామిళ్ల ప్రాంత కవులను ఘనంగా సన్మానించారు వారు సాహిత్య రంగంలో చేస్తున్న సేవలను కొనియాడుతూ మదర్ తెరిసా సేవారత్న అవార్డును ప్రధానం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీ యంబడి ఈశ్వర్  మాట్లాడుతూ సాహితీవేత్తలను గుర్తించి వారి సేవలను సమాజంలో విస్తృతపరచాలనటువంటి తపనతో పుస్తకం పైన ఉన్నటువంటి ప్రేమతో శ్రీ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి  ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వారు తెలుపుతూ తనతో పాటుగా సన్మానాన్ని స్వీకరించిన తోటి కవులు బొల్లు రామ్మోహన్ గారికి, కుందారపు గురుమూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తమను గౌరవించినటువంటి శ్రీ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి గారికి అలాగే ఎం టి ఎఫ్ టీం కు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments