భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ ప్రాంత ఉద్యమ నిర్మాత లో ఒక్కరైనా కామ్రేడ్ కల్లూరు తిరుపతి రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన రాజ సాహెబ్ పేట లో నిర్మించిన ఆయన స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యు లు వడ్డమాను వీరశేఖర్ , బాలు, ఎస్టియు రాష్ట్ర నాయకులు రమణారెడ్డి, విద్యుత్ రాష్ట్ర నాయకులు బ్రహ్మానందరెడ్డి లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతు ఉద్యమ నాయకుడిగా, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా, బద్వేల్ నియోజకవర్గం లో పార్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటారు.
అలాగే తెలుగు గంగా ప్రాజెక్టు, కోసం, ఈ ప్రాంత రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, రైతు కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, పార్టీ కట్టుబాట్లకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కార్మికునికి ఐకమత్యంగా కలుపుకొని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి, రైతు ఉద్యమంలో జిల్లా స్థాయిలో రైతాంగ సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి గా పేరుపొందిన కామ్రేడ్ కల్లూరు తిరుపతి రెడ్డి అన్నారు.
ఆయన పేరుతో పేదలతో కూడిన పోరుమామిళ్ల పట్టణంలో తిరుపతి రెడ్డి కాలనీ ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాల నుండి ఇంటి పట్టాల కోసం పోరాటం కూడా చేస్తున్నారు అన్నారు
ఎర్రజెండా చేతబట్టి చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు నాయకుడిగా ఎదగాలంటే అవి అందరి వల్ల కాదు అలాంటి వాళ్లు అరుదు, నీతి నిజాయితీగా, నిబద్ధతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎదిగిన తిరుపతి రెడ్డి గారికి బద్వేలు ఏరియా సమితి పక్షాన విప్లవ జోహార్లు తెలియజేసి ఆయన అడుగుజాడల్లో నేటి కార్యకర్తలు పనిచేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శులు పివి రమణ, ఇమ్మానియేలు, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,
సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు కోడూరు కేశవ, జాకోబ్ ,సనమల చెన్నయ్య, ప్రసాద్, పిరయ్య పొంగూరు నాగరాజు, నల్లిపోగు నాగేశం, మండల నాయకులు
, గుర్రమ్మ, వారి కుటుంబ సభ్యులు విజయ భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, మాజీ సర్పంచి రామకృష్ణారెడ్డి, చెన్నయ్య, రంగచారి, ఎస్ టి యు నాయకులు సుబ్రమణ్యం, బాలరాజు, లక్ష్మయ్య,, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments