చినుకు రాలితే బురద గుంటలే ఆందోళనలో పోరుమామిళ్ల ప్రజలు


 పోరుమామిళ్ల పట్టణంలోని గాంధీ బొమ్మ సర్కిల్లో మహాత్ముని విగ్రహం కింద రోడ్డంతా వర్షపు నీరుతో నాలుగు రోజుల నుండి నిండిపోయి ప్రజలకు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.అంతేగాక దసరా ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని భక్తులు ప్రతి ఒక్కరూ ఆ రహదారి గుండా అమ్మవారి గుడికి వెళ్ళవలసి ఉంది.ఈ పరిస్థితులలో ప్రజలు అమ్మవారిశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడవలసివస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments